బాలుని పెళ్ళి చేసుకోమని గోల చేస్తున్న నానమ్మ
on Jan 7, 2026

ఆదివారం విత్ స్టార్ మా పరివారం నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. సంక్రాంతి సందర్భంగా సంక్రాంతి సంబరాలు పేరుతో ఈ ఈవెంట్ రాబోతోంది. ఇక ఇందులో బుల్లితెర మీద నటించే వాళ్లంతా వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీస్ తో కలిసి వచ్చారు. ఇక ప్రేరణ వాళ్ళాయన పుట్టుతో కలిసి వచ్చింది. శ్రీముఖి పూతరేకులు పుట్టూ కోసం అంటూ ఇద్దరికీ తినిపించింది. "మీరు తొందరలో పులుపు తినాలని స్వీట్ ఇస్తున్నాం" అంటూ హరి డైలాగ్ వేసేసరికి శ్రీముఖి సీరియస్ గా చూసింది. ఇక ఈ ఈవెంట్ కి శ్రీముఖి వాళ్ళ నాన్నమ్మ వచ్చింది.
"శ్రీముఖి అంటే మాకు చానా ప్రాణం. తనను నుంచి దూరంగా ఉండడం మాకు చానా కష్టం." అంటూ చెప్పింది. "మా ఫామిలీ మొత్తంలో ఫస్ట్ మనవరాలిని నేనే" అంటూ శ్రీముఖి చెప్పుకొచ్చింది. "స్టార్ మాలో నువ్వు బాగా సీరియల్స్ చూస్తూ ఉంటావ్ కదా నువ్వు చూసే సీరియల్స్ పేర్లు చెప్పు" అని అడిగింది శ్రీముఖి. "గుండె నిండా గుడిగంటలు అందులో బాలు ఇష్టం" అని చెప్పింది. "బాలు బాగుంటాడు కదా నానమ్మ" అని అంది శ్రీముఖి. "బాగుంటాడు" అంది నానమ్మ. "నేను పెళ్లి చేసుకొన్నా" అని అడిగింది శ్రీముఖి. "చేసుకో" అంది నానమ్మ. ఇక ఈ షోకి రాకింగ్ రాకేష్ ఫామిలీ, పల్లవి గౌడ ఫామిలీ, ప్రేరణ ఫామిలీ, పల్లవి రామిశెట్టి ఫామిలీస్ వచ్చాయి. చివరిలో అందరూ కలిసి భోజనాలు చేశారు. వచ్చిన వాళ్ళు శ్రీముఖికి కొన్ని గిఫ్ట్స్ కూడా ఇచ్చారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



